పుట:Palle-Padaalu-1928.pdf/212

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

యెరికిలీ

——ఈమె జారిణి. తన అన్వేషణమునూ, రంకువాండ్ర నీతినికూడా చక్కగా, ఉపన్య సిస్తున్నది. తార చెల్లెలు. వాడు మాత్రము యెరికిలి.

గాజులుండే చేతిలోన గందవొడిపూతపూసి
వీధి వీధులు పలవరించుగా - ఓ యెరికిలీ
వీధి వీధులు పలవరించురా
బావిలో బచ్చల్లికూర చేనిలో చెంచల్లి కూర
చెంపకూ సంపెంగ నూనెరా- ఓ యొరికిలీ
చెంపకూ సంపెంగ నూనెరా
నూగునూగు మీస మోడ, నూగు చెట్లకావిలోడ
పరగచేని బాట తెలుపుమురా - ఓ యెరికిలీ
పరగచేని బాట తెలువుమురా
కూడు పెడతా తినిపోరా, కూడావస్తా తోడుకపోరా
ముళ్లు లేని మొల్ల కిందికీ - ఓ యెరికిలీ
ముద్దులాడి మళ్లి పంపురా
ఈతమానూయిల్లుకాదూ తాటిమాను తావుకాదూ
తగరం బంగారు కాదురా, ఓ యెరికిలీ
తగులుకున్న మొగుడు కాదురా