పుట:Palle-Padaalu-1928.pdf/213

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సంతలో బావ

——ఈ చిన్న దానికి విధి విపర్యయమైనది. బావఈమెను వివాహమాడ లేదు. అయినప్పటికీ సంతలో నిండు కన్నుల చూచి సంతోషించినది. నానివర్తనమును గమనింపుడు.

శుక్రవారం సంతలోన బావయ్యో బావయ్యో
చుట్ల మీద తొక్కినావు బావయ్యో బావయ్యో
నువ్వు తొక్కినందు కేడ్వ లేదు బావయ్యో బావయ్యో
నీకాలు నొప్పి కేడ్చాను బావయ్యో బావయ్యో
ఆదివారం సంతలోన బావయ్యో బావయ్యో
అంది అంది గుద్దినావు బావయ్యో బావయ్యో
నువు గుద్దినందు కేడ్వ లేదు బావయ్యో బావయ్యో
నీగుత్తి నొప్పి కేడ్చాను బావయ్యో బావయ్యో
బుధవారం సంతలోన బావయ్యో బావయ్యో
నాబుగ్గలట్టుకు కరిసేవు బావయ్యో బావయ్యో
నువ్వు కరిసినందుకేడ్వలేదు బావయ్యో బావయ్యో
నీపళ్ళు నొప్పి కేడ్చినాను బావయ్యో బావయ్యో

మొదట అతిశయము ఎక్కువై ఆమెకాలిచుట్ల మీద తొక్కినాడు, ఆమె బాధపడలేదు. తరువాతగుద్ది నాడు, ఆమెకు నొవ్వ లేదు. దీనితో వానికే దెబ్బతగిలినది. బుధవారము సంతలో తనతప్పు తీర్చినాడు. కాని ఏమిఫలము ? బాధయేమిగిలినది. ఈ సందర్భమును బట్టి వేరొక పాట జ్ఞప్తికి వస్తున్నది.