పుట:Palle-Padaalu-1928.pdf/211

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గంగి

గంగీకి నాపైన మనసొప్పకుంటేను
నడబావిలోపడి - చస్తాననీ చెప్పు గంగితో
             మాపు - వస్తానని చెప్పు గంగితో
చెవులకు కమ్మాలు, కాళ్ళాకి అందేలు
తెస్తానని చెప్పు గంగితో
             మాపు - వస్తాననీ చెప్పు గంగితో
బాణాల చీరాను, బొమ్మంచురవికాను
తెస్తాననీ చెప్పు గంగితో
             మావు - వస్తానని చెప్పు గంగితో

అన్నీ ఆ తుంటరి మాటలే, ఆగంగి వీనికి లొంగునా?