పుట:Palle-Padaalu-1928.pdf/206

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చిన్నవాడు - చిన్నది.

——వీరిద్దరూ అనుకూలును. ఆ ఉత్సాహము బాగుగా తెలుస్తుంది చూడండి.

చక్కని గుంటా | రాయె నాయెంటా !
సరసకూచుంటా ! పెళ్లి చేసుకుంటా
గుఱ్ఱాన్నెక్కిస్తా | కూడా నేనొస్తా |
సఱ్ఱూన వూరంత | సైదిరిగి వత్తాము . ౹౹చ౹౹

నేకులాన గుంటా | నిన్నంటా
నిన్నే పెళ్లాడతా | నంటా
నాకు నీకు జోడంటా
నాకేమిపెట్టకు | తంటా ౹౹చ౹౹

చేపల బుట్ట | చంక నెట్టి
సందెడు పూసలు | మెళ్లో బెట్టి
కోపుగ కాట్రేడు | చీరనుగట్టి
గోటేసిన రవిక | తొడిగబెట్టి ౹౹చ౹౹