పుట:Palle-Padaalu-1928.pdf/207

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గంగమ్మ పాట

——వీడు ప్రబండములు చదివినవాడు, అందును నలుని దమయంతీ ఆభ్యంతరమందిర ప్రదేశమును తప్పక పఠించి యుండును. గంగమ్మ వెర్రిదేమీ కాదు. ఊరించి ఊరించి ప్రేమించినది.

వంగ సెట్లో పక్క గంగమ్మా
నీవు వంగి సూత్తుంటే "
పానం జల్లుమనె "
నీవు పక్క కెందుకురావు "
పక్కాన నిలుసుండి "
నీవు ఒక్కసారి ముడితే "
నీ కంట్లోకి సూత్తానె "
నేనొల్లు మర్చిపోతా "
అనుమాండ్ల గుడి కాడ "
నువు వంగి మొక్కంగా "
నీ కొంగు జారెనే "
బుద్ది దీరంగ జూస్తినె "
మీ యింటి ఎన్కాల "
పూల సెట్లల్లోన "
పూలు తెంపుతుంటె "
నీ సీర సినిగిపోయె "