పుట:Palle-Padaalu-1928.pdf/205

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

బంగారి పిల్లా

—— ఈ చిన్న వాని ప్రేముడి బూటకము కాదేమో. 'బంగారిపిల్ల' కు ఆందపు దుస్తులు తెత్తు ననుచున్నాడు.

ఓ సిలిపిమాట సిన్నదాన
సిలకపూల సీరబెట్టేనే
ఓ రామసిలకా రంగసానీ
రంగు రంగుల రయిక దొడిగేనే
మునుము బట్టి కూరుసుంటే
గనిమదాకా పలకరించవు
పట్టుపూలా సీరదెచ్చేనే
బంగారి పిల్లా పట్టుకుచ్చులు నీకు దెచ్చే నే.

గట్టిదే ! మునుము పట్టి కూర్చున్న 'కనుమ' దాకా పలకరించదు. ముచ్చటలన్నీ రాబట్టు చున్నది. కనుమకడనైనా పలకరించుకుంటే ఎట్లా ?