పుట:Palle-Padaalu-1928.pdf/204

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గైరమ్మ

——వీడెవరో మరియొక ఆకు జాస్తి గా చదివినవాడు. నక్కజిత్తులు చేస్తున్నాడు. వెరికాకి వీని వలలోపడేనా ?

గైర మ్మోల్ ! గైరమ్మా!
నిన్నే తల్లి గన్న దే | గైరమ్మా ౹౹గై౹౹
నీముక్కెంత చక్కనే 1 గైరమ్మా !
నీ ముక్కులో నత్తెంత | అందమే | గైరమ్మా ౹౹గై౹౹
నీనడుమెంత చక్కనే | గైరమ్మా!
నీనడుము వడ్డాణమెంత అందమే | గైరమ్మా ౹౹గై౹౹
నీకాలైంత చక్కనే | గైరమ్మా
నీ కాలి అం దెలెంత, అందమే; గైరమ్మా ౹౹గై౹౹
నీవొల్లెంత చక్కనే | గైరమ్మ్మా
నీ వెల్ల మీది నగలెంత అందమే | గైరమ్మా ౹౹గై౹౹
నీకళ్లెంత చక్కనే | గైరమ్మా
నీకళ్ల కాటు కెంత అందమే | గైరమ్మా ౹౹గై౹౹

వీని పొగడ్తలు గైరమ్మకోసమా, నత్తువడ్డాణము, అందెలూ నగలూ కోసమా ? తెలుసుకోగల అవకాశము మనకు లేదు.