పుట:Palle-Padaalu-1928.pdf/200

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఓబులేశుని పాట

ఓబులేశునీ కొండల నడుమా
వోంచెగడ్డికోసేదానా
వొంచెగుడ్డా వొల్లెగుడ్డేమే ౹౹హరిఓబులేశ ౹౹
గిద్దెలగిరీ కొండాలనడుమా
యెద్దులు కాచే ముద్దూల మరదీ
నన్ను చూసి నవ్వబోకోయీ ౹౹హరి౹౹
కట్ట మీదనుంచేళ్ళేదానా
కాలుకురచా చిన్న దానా
కానులిస్తాయెంట వస్తావా ౹౹హరి౹౹
ముందటరకా దున్నేవాడా
ముద్దుల మేనత్తకొడుక
దాప టెద్దుకు దప్పికాయెనోయీ ౹౹హరి౹౹

ఎన్ని చరణాలుంటే తనవితీరగలదు ఈ పాటతో, గడ్డిమూట కట్టుటకు లక్ష్మీ దేవికి వేరే 'గుడ్డ' లేక వల్లెలో మూటగట్టినదట; సరి. చిలిపి చూపుల అహోబిలేశుడూరకోనగలడా?