పుట:Palle-Padaalu-1928.pdf/199

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

బాటలో సరసము

——చిన్నది —— కాదుకాదు పెద్దదే కావలయును. పలకరించుచున్నది చిన్న వానిని,

ఆవు నెద్దు బండికట్టె
పరువు పరువున పోయేవాడ
బండినిలిపి బాసలాడర
పెడమల్లి చిన్నా
బండినిలిపి బాసలాడర
ఆకసమున అరటివనము
ధరణి మీద నిమ్మవనము
నట్టనడుమ బండి బాటోయి .
బండి బాటలో బొమ్మలాటోయి
ఉద్దగిరి బండమీద
ఉద్దులెండబోసే పాప
ఉద్దులకు ఎద్దులొచ్చెనే
నుద్దులాడ పొద్దుపోయెనే
బాటవార బండ్ల మీద
చెక్క గొట్టె మీఅక్కమగడు
చెక్క వచ్చి చెంపదగిలెను
ఎక్కడ లేని దుఃఖ మొచ్చెనే
బాటవార బండమీద
వడ్లూదంచే చిన్న పాప
నానబియ్యం నాకు పెట్టవా
మళ్ళీరారా మలచిపెట్టేను

ఆకసమున ఆరటివనము, ధరణి మీద నిమ్మవసము నట్టనడుమ బండిబాట. ఈ పాటలో ఆబాటలోని బొమ్మలాట గోచరిస్తున్నది మనకు. ఇటువంటిదే 'ఓబులేశునిపాట '

168