పుట:Palle-Padaalu-1928.pdf/201

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సిన్నోడు - సిన్నది

——వస్తువు కొంచెము భేదమైనప్పటికిన్నీ ఈ సంవాదముకూడా చిత్రముగానే నడుస్తున్నది.

కొండలోవుండే సిన్నోడా
నీకు కూరేడ కద్దురో సిన్నోడా ?
కుమ్మరోనింటిలో కుండమ్మా
కుండగిండమ్మ నాకంత కూరమ్మా
కూడు గలిగిన సిన్నోడా
నీకు పప్పేడ కద్దురో సిన్నోడా?
అప్పడాలమ్మే కుప్పమ్మా
కొప్పుతిప్పితే నాకంత పప్పమ్మా
పప్పులు గలిగిన సిన్నోడా
నీకు చారేడ కద్దురా సిన్నోడా?
సీమతోపోయే యేరన్నా
ఏరు పెరికితే నాకింత చారన్నా
చారు గలిగినా చిన్నోడా
నీకు నెయ్యడ కద్దురో సిన్నోడా ?
కుక్కనుకొట్టే కొయ్యమ్మ
కొయ్య గియ్యమ్మ నాకంత నెయ్యమ్మా
నెయ్యిగల్గినా సిన్నోడా నీకు
పెరుగేడ కద్దురో సిన్నోడా ?

190