పుట:Palle-Padaalu-1928.pdf/198

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కొడుకు:- అడుగులేని పెద్ద గంపతెస్తానన్నది గడ్డికి
          అది తెస్తే పోతాగడ్డికి లేకుంటేపోనే గడ్డికి
తల్లి:- ఆబ్బి పోరా గడ్డికి
          నాబాబు పోరా గడ్డికి
          నాతండ్రి పోరా గడ్డికి
కొడుకు:- కరకంచు పెద్దకోక తెస్తానన్నది చుమ్మకి
          అది తెస్తే పోతా గడ్డికి లేకు టేపోనే గడ్డికి

తల్లిపోరు పడలేక గడ్డికోతకు పోయినప్పుడైనా చిలక ముక్కు చిన్ని కొడవలి, మొనలేని పెద్ద బొరిగె, ఆడుగు లేని గంటకావలెనట వానికి ! వేరు సాధనము లైనచో గడ్డి కోతకు అంతు గలుగును. ఈసాధనములతో పవలంతయు 'పని' లో గడపగలదు.

187