పుట:Palle-Padaalu-1928.pdf/197

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రాగంవాళ్ల రంగుచిన్నది

——వీడెవడో బండవాడు, వీని మైకము జీవితావసరములను దాటినది.

తల్లి:- అబ్బి పోరా గడ్డికి
         నాబాబు పోరాగడ్డికి
         నాతండ్రి పోరాగడ్డిక
కొడుకు:- రాగంవాళ్ళ రంగు చిన్నది వస్తానన్నది గడ్డికి
         అదివస్తే పోతాగడ్డికి రాకుంటేపోనే గడ్డికి
తల్లి:- అబ్బి పోరా గడ్డికి
         నాబాబు పోరాగడ్డికి
         నాతండ్రి పోరాగడ్డిక
కొడుకు:- చిలకముక్కు చిన్ని కొడవలి తెస్తానన్నది గడ్డికి
         అది తెస్తేపోతాగడ్డికి లేకుంటేపోనేగడ్డికి ,
తల్లి:- అబ్బి పోరా గడ్డికి
         నాబాబు పోరా గడ్డికి
         నాతండ్రి పోరా గడ్డికి
కొడుకు:- మొన లేని పెద్ద బొరిగే తెస్తానన్నది గడ్డికి
         అది తెస్తే పోతాగడ్డికి లేకుంటేపోనే గడ్డికి
తల్లి:- అబ్బి పోరా గడ్డికి
         నాబాబు పోరా గడ్డికి
         నాతండ్రి పోరా గడ్డికి

188