పుట:Palle-Padaalu-1928.pdf/188

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చల్ మోహనరంగ

——చల్ మోహనరంగ పదము నెరుగని వారుండరు. వనజాక్షి పుణ్యమాయని దాని అసలు వరుస రూపుమాసిపోయినది. రచన ప్రాకృతుని రచనకాదు. కాని అసలు తెలియనప్పుడు లభించినంత పట్టు ప్రచురించుటే కర్తవ్యమని దీని నిచ్చితిని. ఈపాటకు రెండు మూడు పాఠాంతరములున్నవి. కాపీరైటు సంపాదించుకొనుటకు ఏ కవిచేతనో కొన్ని చరణాలు కల్పించజేసిన రూపములు రెండుమూడు అచ్చులో కనబడుచున్నవి. అసలు పాట మన్మధుని వంటిదైనచో నిది యాతని బూది,

1

రంగారు చెట్టుమీదా - బంగారు గోరువంక
       వినిపించే కతలు విందము పదరా
చివురాకూ వల్లెరములో - మివులపండిన పండ్లు
       సవిరించీ ఆరగింతము పదరా
పొగడ పూవులు గోసి - పొందుగనే దండగుచ్చి
       దండనీ మెడను వేసుకురారా
చిరిమంచుకోటలోన - గురుతైన మంచెమీద
       శిరిపాట పాడుదాము పదరా ౹౹చల్ ౹౹

2

చుట్టు తుమ్మెదలుగూడి – గట్టి బాజాలు పాడి
       అట్టిట్టు తిరుగుచున్నవి కదరా
కోనమావి కొమ్మలందు - గొనబైన రామచిలుక
       ధనములందిచ్చుచున్నది గదరా

177