పుట:Palle-Padaalu-1928.pdf/187

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మాఁవ

ఉల్లిపూలా పడవాగట్టి
                 మాఁవ!
మల్లి రేకుల తెఱనుదించి
నాగులేటి వాగులోన
                మాఁవ!
తేలీ పోదామా?
మొగిలిపూల తేరూగట్టి
                  మాఁవ
మొగిలి రేకుల గొడుగుపట్టి
మొగులు మేసే కొండా మీద
                       మాఁవ
ముద్దుగానే ఎళ్లూదామ

కుంభ గత ప్రదీప కళాకాశ్రీదోవ నెందుంబో కెందే నింద్రియముల్ రహి౯గను ' ఇంపు కోరలేదీ ప్రేయసి. మొగలిరేకు గొడుగు పట్టి మొగులు మేసేకొండమీద నీడబొమ్మలవలే గోచరిస్తుండడమే ఈమె కాంక్ష.

178