పుట:Palle-Padaalu-1928.pdf/189

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గుబురైన చింతమీద - కబురు తెచ్చేటి చిలుక
       సొగసైన గూడు కట్టెను కదరా ౹౹చల్ ౹౹

3



నీవుపోయే దారిలోని - నిలువుటద్దములలోన
       నీదురూపు నిలిచిపోయెను గదరా
చిరునవ్వూ నవ్వితేనూ కురియూ పువ్వులవాన
       చిరునవ్వాసించియుంటినిగదరా
శనివారం సంతలోన పనిబూవి సంతలోన నిను వెదకి
       పరుగెత్తి పట్టుకొంటిని గదరా
బొండుమల్లె పూలదండ నిండుగా నీమెడను వేసి
నిండారా కౌగిలింతును రారా ౹౹చల్ ౹౹

4


చీకటి రాత్రినాడు - కోకనల్లది కట్టుకోని
       చీకట్లో కలిసిపోయితిగదరా
ఊడల మర్రిక్రింద - మోడైన తుమ్మచూచి
       చీకట్లో ఝడును కొంటిని గదరా
గట్టుదాటి పుట్టదాటి ఘనమైన యడవి దాటి
       అన్ని దాటి అరసి తరలితి గదరా
ఒంటిగా పోవద్దు వద్దని - పైటబట్టి లాగగానే
       పైటజారి సిగ్గుపడితిని గదరా

178