పుట:Palle-Padaalu-1928.pdf/183

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కోడినిస్తామా నెరా కోడి
పెట్టనిస్తామా నెరా
కోడినమ్మినకాలురూపాయి
కోరియిసామా నెరా

వారవారముదినమురా రామ
సవురేపల్లె సంతరా
సవురేపల్లె సన్నామల్లెలు
కుచ్చుల్నాల్నర దుడ్డురా

ఊరిపడమట బాటరా నే
బాటకూలికి పోతరా
అందరకు మూడుదుడ్లు
నాకు నాల్నర దుడ్డురా !

ఇటువంటి పాటయే ఒక గొల్ల దానిని గురించినది కలదు.

కుడితటా కొప్పుది కుంకుమురైకది
బామా సక్కని గొల్లదిరా- కులమూసక్కనిగొల్లదిరా
మాపిడిగొర్లూ మందకు రాగా ౹౹మా౹౹
మర్మామెరుగని గొల్లదిరా, అదియేమో యెరగని సిన్నదిరా౹౹
చప్పిడిమెట్లా సల్లాకడవలు ౹౹చ౹౹
సరసామెరగని గొల్లదిరా సంసారమెరుగని గొల్లదిరా౹౹

ఇది పైదానివలె మిశ్రగతిలో కాక చతుర ప్రగతిలో జోరుగా సాగిపోతున్నది.

172