పుట:Palle-Padaalu-1928.pdf/182

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గుండ్లపల్లి గురివి

——పడుచువాడు తన వలపుకత్తెను గురించి నేస్త గానితో——విదూషకునితో కాదు—— చెప్పు తున్నాడు. ఆమె సిరిమంతురాలు. తనకీలు కడియము చెఱిపించి వానికి కిన్నెర చేయించినది. అందరికీ మూడుదుడ్లూ వీనికి నాల్నర దుడ్డూ ఇచ్చుటలో ఆశ్చర్యమేమున్నదీ? చెలిమి మంచితనము వలపునుగలచోట వీనితగులముండుటలో ఆశ్చశ్యమేమున్నది ?

బావిగడ్డున చేను జెయ్యరో చన్నంగి రామా
బావినీళ్లకు నేను వచ్చేనూ !

అన్నది ఈకోవలోని ప్రియురాలే తనవలపు కానితో, వాడు సొమ్ముకలవాడు కాడు. ఆకొండ్ర పండదని జంకు.

బావి గడ్డున చేను జేస్తేనో జాలారిపాపా
చేనుగుత్తామీదబడి తేనో

అన్నాడు. వలపుండవలెను గాని ఉపాయములకులోటేమి ?

చేనుగుత్తా మీదబడి తేనో చన్నంగిరామా
చెవుల కమ్మలమ్మి కట్టేనూ

అని ధైర్యము చెప్పినది.

గుండ్లపల్లి గురివిరా - దాని
చేత కీలు కడియమురా
కీలు కడియం సెడాగొట్టి
కిన్నెరాచేయించెరా

171