పుట:Palle-Padaalu-1928.pdf/184

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పిలుపు

——ఇది పిల్లవాని విరహమును తెలుపుపాట, వెన్నెలలో మల్లెపూల పందిరి క్రింద సెండి కట్ల కిన్నెర పట్టి కూర్చున్నాడు. ఆమె వచ్చిన నవ్వులోనే తెల్లవారునట. ఆనుభవములను మీదుకట్టి ప్రాచీన సంస్కృత కవులవర్ణనలను అలంకారములను నెమరువేస్తు రచించే పండి తుల వర్ణనలు ఈ పాటపొలి మేరలను చేరగల వేమోచూడుడు. దీనిని విన్నప్పుడు ఉమర్ ఖయాము జ్ఞప్తికి వచ్చును. ఇట్టి పిలుపును వహించుటకు గాలికి, మేఘునికి, చంద్రునికి కూడ సంతోషమేకదా!

వేళజూడ వెన్నెలాయె వెండికట్ల కిన్నెరాయె
మల్లెపూల పందిరాయె, వయ్యారిరావె
                    నవ్వులోనె తెల్లవారును
కొండగోగులు పూసెనేమొ కొండనిమ్మలు కాసెనేమొ
దొండపండులాంటి పెదిమె - వయ్యారిరావె
                    మనసు ఎవరి పాలు జేతును
మల్లెపూవులు పూసినట్లు మళ్లీ మళ్లీ మాటలాడు
మల్లె పూలవంటి మనను, వయ్యారిరావే
                    పూవులెవరి పాల జేతును
నందిపూసె కందిగాసె కందికొసలు నందిమేసె
అందమైన 'మేలినడల వయ్యారిరావె
                    గంధమైన పంపబోతిని

173