పుట:Palle-Padaalu-1928.pdf/181

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

          తెప్పతోటి చినుకులొచ్చే లగ్గోపిల్లా
          అంగట్లో మొన్నగొన్న "
          కొత్త గొంగడన్న కప్పుకోవె "
          దగ్గరకి రారాదె "
          నీవు సిగ్గుబడితె తడుస్తావు "
          వాన వెలిసి వెన్నెలొచ్చే "
          మనం తానమాడి నటులాయె "
లగ్గోపిల్ల:- బట్టలన్ని తడిసిపోయే పిల్లవాడా
          నేను పట్టుకోక తెచ్చుకుంట "
పిల్లవాడు:- నీవు పట్టుకోక తెచ్చుకుంటే లగ్గోపిల్లా
           నేను పట్టంచు ధోతి గడత "
           లగ్గమైన మనను తోటి "
           మనం లగ్గమైతె బాగుండు "
లగ్గోపిల్ల:- వూరుపల్లె విడిచి పెట్టి పిల్లవాడా
           ఈ వూరు బయట లగ్గమేంది. "
           బాజాబజంతీలేవి "
           మంచి మోజు మీద సవ్వడేది "
           కులము కులము కలసినంక "
           ఈ పొలము కాడ తొందరేమి "

పిల్ల వాడు గాంధర్వము కబుర్లు చెప్పటానికి దుష్యంతుడు కాకపాయె. పిల్ల గట్టి బ్రేక్కే వేసింది.

170