పుట:Palle-Padaalu-1928.pdf/180

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చిన్నోడు:- తెల్లజొన్న రొట్టె జేసి లగ్గోపిల్లా
           మంచి వెన్నబూసి వెంటతేవె "
           పల్లెదరి తోటకాడ "
           మంచి తెల్లమల్లి పూలు తేవే "
           నా చేను పండిపోయే "
           ఇంక నీచేను పండదాయె "
           చేను చేను గలసినట్టు "
           నీమేను మేను గలపరాదె "
లగోపిల్ల:- కారుమాట లాడబోకు పిల్లవాడా
           మావారు వచ్చి చూస్తారు "
           కారుమబ్బులొచ్చినాయి. "
           నాకు దారి చూపు లేచివచ్చి "
           కటికి చీకట్లు కమ్మె "
           చిటుకుపొటుకుమంట వాన జూడు "
           అటుకు మీద పిడకలన్ని "
           ఆ అటుకు మీదె వుండిపోయె "
           గుడిసె మంచె కెళ్ళుదాము "
           చూడు తడిసిపోయి వణుకు తాము "
పిల్లవాడు:- నీ చేనుగుడిసె మంచే లగ్గోపిల్లా
            నా చేను వొట్టిమంచే "
            తెప్పమీద తెప్పవచ్చె "

169