పుట:Palle-Padaalu-1928.pdf/172

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పంచవన్నెల సిలక

——ఇటు వంటిదే ఇంకొక పాట. ఈ పాటలో చిన్నది జవాబిస్తున్నది. అయితే అభి మానము కాదు, ఆమెను పరీక్షిస్తున్నది; అచ్చెరువు !

మంచెదిగవే పాంచాల సిలకా మంచెదిగవే
మంచెదిగవే ఓ పంచవన్నెల సిలకా
వొంచీన తలయెత్తి వాలూ సూపులుసూసి
మంచెదిగవే పాంచాల సిలకా ౹౹మంచెదిగవే ౹౹
సేబాను కురవాడా సెవులాపోగులవాడ
మాబావ కన్నవిన్న మరియాద దక్కునా
మంచె దిగనూ నేను కంచెదాటి రానూ ౹౹మంచెదిగనూ౹౹
అల్లాము బెల్లాము తెల్లాకొంగున కడుదు
తెల్లాకొంగున కట్టి తెల్లవారేసరికి పోదు
మంచి దిగవే పాంచాల సిలకా ౹౹మంచెదిగవే ౹౹
అల్లాము బెల్లాము వల్లాదు నామనసు
అన్నాదమ్ములు సూత్తె ఆచోరు నిలవాదు
మంచెదిగనూ మంచి మురుగులవాడా ౹౹మంచెదిగనూ ౹౹
పూలా రైకాదాన వాలూ సూపులదానా
కాలులోములుదిగెనూ కాసింతములుతీయే
మంచెదిగవే పాంచాల సిలకా ౹౹మంచెదిగవే ౹౹
కాలిలో ములుదిగితె కఱ్ఱి మంగలిగలడు
తాలీ కట్టినోడు తాయెత్తు కట్టూను
మంచే దిగనూ పొంచున్నసినవోడ ౹౹మంచెదిగనూ౹౹

161