పుట:Palle-Padaalu-1928.pdf/171

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మంచెదిగవే

ఏలలు అన్నవి నిర్ణీత చందో నిర్మాణము గల పదములు. యౌవనానుభవమును సూచించే భావాలున్న పదములను ఇక్కడ ఏలపాట లంటున్నాము. ఈ అర్థముతో 'ఏలపాటలు ' అన్నమాట వాడుకలో నున్నది. వీటి ఛందము మాత్రము ఏలల ఛందముకాదు అయినప్పటికిని 'వీధిబోయెడు ప్రౌఢ విటుడుపాడెడు వింత, ఏలపదాలట్టె యాలకించు ' నన్న కదిరీపతి పలుకులు ఏలపాటల కీయర్థమునే సాధించుచున్నవి.

ఏలపాటలలో పడుచువాండ్ర భావాల ఛాయలన్నీ కనబడుతాయి. పంపిక వాజ్మయములో ఇవి అరుదు.

——యదాలాభముగా చూచినపడుచును కికురిస్తున్నాడు యువకుడు.

ముద్దూ మొగమూదాన ముక్కూపోగూదాన
కాకి వేషముదాన కామంచి పడుచా
                                 మంచెదిగవే ౹౹
అఱక చేనులోన ఆవూలున్నవి భామ
ఆలమందానన్న అదలించరావే
                                 మంచెదిగవే ౹౹
కొఱ్ఱ చేనూలోన కోడెలున్నవి భామ
కోడె మీదానైన కోపించరావే
                                 మంచెదిగవే ౹౹
రూమాలమూటలో రూకలున్నవి భామ
మంచెకిందికి రావె పంచుకుందామూ
                                  మంచిదిగవే ౹౹

160