పుట:Palle-Padaalu-1928.pdf/173

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అల్లిక గుత్తముగా లేకున్నా నాగరిక రచనవలె కనబడ లేదు ఈపాట. విన్న వారి ఆపేక్షను పట్టి ఉంచడానికి చిన్న దాని చేత జవాబు చెప్పించాడు జానపద రచయిత.

ఈ రకపు పాటలు చెంచు నాటకములలో కూడా కనబడుతున్నవి. సింగడు

గుండు దిగవె చెంచిత గుండు దిగవే
వేళ్లకు తగ్గ కనకపు శ్రీ మెట్టె లిచ్చేనూ౹౹

అంటే సింగి

గుండు దిగనూ ఓబులా గుండు దిగనూ
వేళ్లకు తగ్గ కనకపు శ్రీ మెట్టె లొల్లనూ౹౹

అని జవాబు చెప్పేపాటను దొణప్పగారు పేర్కొనినారు. ఈ పాటలు వాడుకలో నున్నవే నాటకములలోనికి దిగియుండుననుటే సమంజసమేమో. ఏలలూ, లాలి, జోల, శోభనము, తలుపు దగ్గరపాట, మేలుకొలుపు, ఉయ్యాలపాట అన్న వన్నియును వాడు కలోనున్నని నాటకములో ప్రవేశించినవి.