పుట:Palle-Padaalu-1928.pdf/168

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పడవ పాట

——ఈ తెప్పపాట రచన యేమోననిపిస్తున్నది. కాని దీని నిచ్చిన మిత్రులు కోటిపల్లిలో పడవవానికడ రాసుకున్నానని చెప్పినారు. అందంగా ఉన్నది. "రవ్వమువ్వల తెప్ప రవగాలి"కి వెళ్లినదట.

పల్లవి:-గట్టెకు తాదా ! నాతెప్ప
కల్లోల జలధిలో మునిఁగిపోతుందా ౹౹గ౹౹
కొక్కురో; కోయంచు | కోడి గూయంగానె;
దేవుడిచ్చిన నిద్ర | తెలిసింది రాయంచు;
చలిగాలిలో వళ్లు | సవరించుకొంటు
చద్ది గట్టు కనేను | చక్కవచ్చాను ౹౹గ౹౹
చల్లన్ని గాలిలో | మెల్లంగ వెలిగేటి,
చంద్రయ్యనే జూచి | సంద్రమే పొంగింది,
పొంగేటి కెరటాలు | వంగుతూ, వాలుతూ,
రవ్వమువ్వల తెప్ప | రవగాలి కెళ్లింది ౹౹గ౹౹
పదిగుళ్ల వలదీసి | పారజూస్తే, తెప్ప
పొంగినా కెరటాలు | బొబ్బలెట్టాయి
కారుచీకటి గ్రమ్మి | కళ్లకు పస్తయ్యే
సరిగపోయే తెప్ప | గిరగిరాతిరిగింది ౹౹గ౹౹
గాలిజోరుచూచి | కల్లోలమే చూచి
కుదురులేని గుండె | కొట్టుకోసాగింది

157