పుట:Palle-Padaalu-1928.pdf/169

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చుక్కాని తిప్పుచు ! శోకాన మునుగుతూ |
ఆంతు, పంతూలేని ! ఆనీటిలోనుండి ౹౹గ౹౹
ఇంతలోనే యిల్లు | యింటిపిల్ల నాకు
జ్ఞప్తి రాగా వల్లు ! గలగలా లాడింది
యింటి పిల్లింక, నా | కంటపడతాదా
సరసాలతో నేను | మురిసి పోతానా! ౹౹గ౹౹
పొమ్మంటే పోతుంద | రమ్మంటే వస్తుంది ?
రంగడి దయలుంటే ! కంగారుపడనేల?
గాలిలో నేనింక ! కూలినా సరిగాని;
రంగడే మాయోడు | రంగడే దొంగోడు ౹౹గ౹౹
మనను కలిసినవారి | మనసులొకటల్లేను
కుటిల మెఱుగని బాబు | గుండె కాయల్లేను
మబ్బులన్నీ దాటి | మారాజు సూరయ్య
గప్పుగప్పూ మంటూ | గంతేస్తు వచ్చాడు ౹౹గ౹౹
పొంగుతూ వలదీసి | బుంగనిండేదాక
చేపలేరుక నేను | చెంగున గట్టెక్కి
నావ కట్టి బెట్టి | నాయింటి కెళ్ళాను
పిల్ల కంటబడితె | వల్లు చల్లాగుంది
(గట్టెక్కినాది, నాతెప్ప | కల్లోలిజలధిలో కడతేరినాది)

158