పుట:Palle-Padaalu-1928.pdf/167

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కంటికి కాటుక బెడితే- సిరిసిరిమువ్వ
       నేను కన్నె అనుకున్నా నే-సిరిసిరిమువ్వ ౹౹
పైట పావడా గడితే-సిరిసిరిమువ్వ
       నే-పడుచు అనుకున్నా నే-సిరిసిరిమువ్వ ౹౹
పౌడ రేసు కుంటేను-సిరిసిరిమువ్వ
       నేను-బాలికనుకున్నా నే–సిరిసిరిమువ్వ ౹౹
తళుకు జూపిస్తేను-సిరిసిరిమువ్వ
       నా-వలుపులనుకున్నా నే-సిరిసిరిమువ్వ ౹౹
నీమిద వలపంటే - సిరిసిరిమువ్వ
       కామాలునను కున్నా నే--సిరిసిరిమువ్వ ౹౹
సంకురాత్రి పండుగనాడు-సిరిసిరిమువ్వ
       నేను-సారానీళ్ళు త్రాగబోతే-సిరిసిరిమువ్వ ౹౹
ఒంటిగా నుంటేను-సిరిసిరిమువ్వ
       నా-కొక్క చుక్క దిగ లేదు-సిరిసిరిమువ్వ ౹౹
కష్టపడ్డ డబ్బంత--సిరిసిరిమువ్వ
       ముండ-కాటిమీద బెట్టినానె-సిరిసిరిమువ్వ ౹౹
ముద్దు గుమ్మ నేడిపించి - సిరిసిరి మువ్వ
       పాడు -ముండలకు బెట్టినానె-సిరిసిరిమువ్వ ||
సముద్రాలు దాటిపోతే-సిరిసిరిమువ్వ
       పై-సాయైన లేకపోయె-సిరిసిరిమువ్వ ౹౹
బుద్ది లేక రంగమెళ్ళి-సిరిసిరిమువ్వ
       యీరద్దిపాలు బడ్డానే-సిరిసిరిమువ్వ ౹౹

158