పుట:Palle-Padaalu-1928.pdf/166

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సిరిసిరి మువ్వ

——రంగము పోవటము, సొమ్ము చేరటము రంగసాని చెలిమిచేయటము, సొమ్ము చేయి జారటమూ అయినవి. సముద్రాల కటువైఫున ఉన్న చిన్నది గుర్తుకు వచ్చినది.

జోడుకొయ్యల వాడ మీద-సిరిసిరిమువ్వ
       జోడగ్గి పెట్టే లంపినానే-సిరిసిరిమువ్వ ౹౹
ఆది అందిందో లేదొనె-సిరిసిరిమువ్వ
       నాకు తిరుగుజాబు లంపలేదే--సిరిసిరిమువ్వ ౹౹
మూడు కొయ్యల వాడమిద-సిరిసిరిమువ్వ
       నీకు ముక్కు పుడక లంపినానే-సిరిసిరిమువ్వ ౹౹
అది అందిందొ లేదొనె-సిరిసిరిమువ్వ
       నాకు తిరుగుజాబు లంపలేదూ-సిరిసిరిమువ్వ ౹౹
నాలుగుకొయ్యల వాడమీద - సిరిసిరిమువ్వ
       నీకు నానుకోడు లంపినానే-సిరిసిరిమువ్వ ౹౹
అది అందిందొ లేదో-సిరిసిరిమువ్వ
       నాకు తిరుగుజాబు రాలేదు-సిరిసిరిమువ్వ ౹౹
అర్ధరూపాయి డబ్బులకు- సిరిసిరిమువ్వ
       నువ్వాశపడా బోకంది- సిరిసిరిమువ్వ ౹౹
ఆసుపత్రి పాలై తే-సిరిసిరిము
       నిన్నాదుకోనే వారు లేరంది-సిరిసిరిమువ్వ ౹౹
కసరి కసరి కొడితేను-సిరిసిరిమువ్వ
       నేసరసమనుకున్నానే-సిరిసిరిమువ్వ ౹౹

135