పుట:Palle-Padaalu-1928.pdf/165

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఓ డెల్లి పోతున్నది

——పాపము ఆ చిన్నది ఏమిచేయగలదు. ఓడ కంటికి కనబడు నంత వరకూ ఏడుస్తునే ఉన్నది.

ఓడెల్లి పోతున్నది మారాజో ఓడెల్లీ పోతున్నది
చెన్నాపట్నం రేవులోన చెట్టా పట్టాలేసుకొని
చెవిలో గుసగుసలేమో చెప్పిపోయిన మారాజో ఓడెల్లి

కాకినాడ యీదుల్లోన కాటుక కన్నుల జూచి
కన్నీళ్ళు చేత తుడిచి కనికరించిన మారాజో

నీవంద కత్తివావి నిలువూట ద్దాన చూచి
నీడజూచి మురిసిపోయిన నీటుగాడవు మారాజో

భీముని పట్టాములోన పిన్న పెద్దలందరుజూడ
పెద్దాపందిరిలోన పెళ్ళాడిన మారాజో

కంచంలో బువ్వెట్టుకొని కమ్మని యెన్నెలలోన
కసిగాటు కొట్టుకొంటూ కలవరించిన మారాజో

అందమైన నీ మోము చందురూని చూస్తూంటే
గుండెచల్ల బడతాదాని గునిశాడిన మారాజో

154