పుట:Palle-Padaalu-1928.pdf/164

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చెంచు

——నాయుడు కన్నాగడుసు వాడీ యువకుడు. ఇక్కడి విలాసములు చాలక రంగము పోతున్నాడు, పలికే మాటలు మాత్రము ఇవి.

మళ్ళీ వచ్చిందాక మర్లూ మరవనంటా
శేతులో శెయ్యేసి శెప్పోలె శెంచు

కూడొండి పెడతాను గుడ్డుతికి పెడతాను
కూడాతోడ కపోవా జోడుగా మావా ?
నీమణుచు నామణుచిరకూ దప్పాకుంటే
యెడబాసి నెలవుంటే నేమోలే శెంచు జోర్శెయ్

ఏవూర నేపల్లె దేనిమీ కన్నేశినవో
యెంటా నన్రానీవు తుంటారి మామా జోర్శెయ్

కోకా జరీ తెస్తా కొప్పూ బిళ్లా తెస్తా
నవ్వూతా శెలవిచ్చి నన్నంపే శెంచు జోర్శెయ్

కోకా జరీవొద్దు కొప్పూ బిళ్ళా వోద్దు
రానీ వానీ తోటి కానీవో మామా జోర్శెయ్

శెంపాముద్దెట్టుకొని శెల్లో బాయ్ యేడవకు
అల్లాడే సారంగు యెల్లీపో శెంచు జోర్శెయ్

153