పుట:Palle-Padaalu-1928.pdf/151

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పాము మంత్రము

——ఇది పాము మంత్రమునకు సంబంధించినట్లు కనపడుతున్నది. పాము సౌందర్యాన్ని చూడండి.

నాగా దిగురా |
నాతండ్రి దిగరా | నాగన్నదిగురా | నాగాదిగురా |
దిగుదిగు నాగన్న దివ్య సుందరనాగ
నల్ల చుక్కలనాగ నాముద్దునాగా ౹౹నాగా౹౹
నవనవ లాడేటి నల్లచుక్కలనాగ
తళతళ లాడేటి తెల్ల చుక్కలనాగ
పసిమి పొరలుగల పచ్చన్నినాగా ౹౹నాగా౹౹
కొండ చిలువలకెల్ల కోర్కెతో రాజువై
పరుగుడు పాములకు ప్రభువు వైరంజిల్లి
మొగలి చెటపైని మసలి తిరుగులాడి
పాలు ఆరగించు పచ్చన్ని నాగా ౹౹నాగా౹౹
పక్కాను పదిహేను మచ్చాలుగలవాడ
గురివింద పూసల కళ్లయిన గలవాడ
సరికి ముళ్లవంటి పళ్లుగలవాడ నాగాదిగురా ౹౹

140