పుట:Palle-Padaalu-1928.pdf/152

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నాగదేవుని పాట

——ఆరడుగులు కలిసివేస్తే ఆప్తులవుతారట. చేలలో తిరుగుతూ చేను చేఱిపే ఎలకలను పట్టిమింగేటి పాము ఆప్తవర్గములోనిదే. నాగన్నకు సలహా యిస్తున్నది గృహిణి.

పుట్టలోనాగన్న బూచినాగన్న
ఎండలో పడుకోకు వెరినాగన్న
కలిగినోరి కోడళ్లు గర్వవంతూలు
కలాపిజల్లేరు కాళ్ళచిమ్మేరు
ఎంగిళ్లుజల్లేరు భంగవుచ్చేరు.
ఆటుబోకు నాగన్న చాకి రేవులకు
చాకి రేవులలోన చేరిపడుకుంటే
సాలిపరుగుడని సంపేరునాగు
అటుబోకు నాగన్న చెఱుకుపొలములకు
చెరుకుపొలములలోన చేరిపడుకుంటే
నల్లచెరకు అని నరికేరునాగు

141