పుట:Palle-Padaalu-1928.pdf/150

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నాగుమయ్య

——ఇది నాగ పూజను గురించిన పాట. తొలయుగాలలో భయంకర వస్తువులన్నీ- ——రుద్రునివలె——దేవతాంశము కలవిగానే పరిగణించినాడు. ఆదిమ మానవుడు. నాటి నుండి నేటికి దిగివచ్చిన నమ్మకమున కుదాహరణమీ పాట.

ఉసిరిగ చెట్టు కింద పసరిగ పాము
కూసమూడ్చీ పాము పడగ బుస్సంది
పామునన్నూ చూచీ పడగ నెత్తింది
పడగలెత్తకు పాము పగవారముకామూ
పడగెత్తి దూసింది నాలుకలు రెండూ
నాలుకలు దూయకే నీవారము నాగూ
మంచినాగూ వైతె పంచలెట్టేము
కోడెనాగూ వైతి కోకలెట్టేము
పడగలెత్తకు నాగు పగవారముకాము
మాచేను పండితే చలిమిడేసేము
మా నువ్వులు పండితే చిమ్మిలేసేము
నాలుకలు దుయ్యకే నీవారమునాగూ
మాపత్తి పగిలితే పంచలెట్టేము
మాయావులీనితే పాలుపోసేము
పడగ లెత్తకు నాగు పగవారముకాము
నీ పూజ చేసేము నీకు మొక్కేము

139