పుట:Palle-Padaalu-1928.pdf/149

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నాగుమయ్య ఉనికి

——ఈ పాటలో పాముల ఉనికి చెప్పబడింది.

పిల్లలందరుగూడి పుల్ల లేరబోతె
పుల్లల్లో వుండేటి ఓపుల్ల నాగ ౹౹
ఇల్లలికి ముగ్గెట్టి మల్లెలు విరజల్లి
మల్లెల్లో వుండేటి ఓమల్లి నాగ ౹౹
గొల్లభామలుకూడి చల్లల్లు చెయ్యంగ
చల్ల కుండ కింద చల్లనాగయ్య ౹౹
ఇవతల యిదికొండ అవతల అదికొండ
నట్టనడుమను కొండ నల్లతాచయ్య |

అనుభవానికి చక్కని వర్ణవ. ఈ పాటలలో ఈ గుణము సర్వత్రా కనపడుతుంది.