పుట:Palle-Padaalu-1928.pdf/148

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నాగుల చవితి

——ఆంధ్రులకును నాగులకును విడిపోని చెలిమి. అమరావతి శిల్పములలో 'వాగముల వంటి తలపాగలు విరివిగా కనపడును. మధ్య భారతపు బార్హతు శిల్పాలలో కూడా తలపాగలు కనపడును. అయితే ఆతరువాతి సాంచీ, అమరావతీ' నాగార్జునకొండ చిత్రములలో విరివిగా కనపడుటను బట్టి తలపాగా తెలుగువారి అభిమాన ఫుటలంకరణమన వచ్చు నేమో!

ఈ పాటలు పాములకు సంబంధించినవి. క్రూరప్రాణి అయిన పామును కూడా ఆప్తులలో చేర్చుకుని పాటలు పాడడము వినోదకరమైన వింత.

ఇది జోల పాటలలోనిది.

నాగస్వరం, పొడితే | నాగులకు నిద్ర
పుట్టలో నుంటేను | భూములకు ముద్ర
అమావాస, పున్నాల } మసగలే సుద్ద
పాటి మీదాకోస్తే | కక్ష కట్టేను
బూక రించుచు | పడగ బుస్స కొట్టేను
గుడిలో నాగులు | కొల్చిన దేవుఁడు

137