పుట:Palle-Padaalu-1928.pdf/145

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

టనానాటంకు చెలొ

——గారడీ వాడు ఏల పాటల పుట్ట. శతాబ్ధాల మెట్టమీద మారిపోకుండా దిగి వచ్చిన యెమ్మె కాడు. ఇది లోక వ్యవహారాలన్నిటినీ ఎత్తిచూపుపాట. ఈ వరసని చరణాలు ఎన్నైనా వుంటవి. మచ్చుకు కొన్ని

నామగడు వాడకెళ్లే నాకు తోడు ఎవరు లేరూ
కోడికూసే వేళ దాకా తోడురారా వన్నె కాడా ౹౹టనాన౹౹
చింత చెట్టు చిగురుచూడూ, చిన్నదానీ యీడుచూడూ
అద్దములొ నీడ చూడూ, ఇద్దరికీ జోడు చూడు ౹౹టనాన౹౹
నరసాపురమునుంచి నలిగి నలిగొస్తంటే
తాళ్ల పాలెముకాడ తగిలింది జ్వరమూ ౹౹టనాన౹౹
చంకలోని నీళ్ళకడవా - నీడజూచి నింద గట్టిరి
ఇద్దరికీ యిట్టమయ్తె - ఎవరి దేమి భయ్యమే ౹౹టానన౹౹
ఇంటి మొగుడికి వంటెద్దుబండీ - రంకు మొగుడికి రెండెడ్ల బండీ
మధ్య తిరిగే లాల్ గాడికి - దొరలుఎక్కే మరలబండి ౹౹టానన౹౹
ఇంటి మొగుడికి యీతకల్లు - రంకు మొగుడికి తాటికల్లు
మధ్య తిరిగే లాల్ గాడికి - దొరలు త్రాగే బ్రాందిసీసా ౹౹టానన౹౹
తల్లిపిల్ల నిడిసి యాడు - సేసుకున్న భార్యనిడిసి
దొమ్మరదాని యెంటపోతె -డోలు మెడకు యేసెరా ౹౹టానన౹౹
కల్లు తాగి ఒళ్లుమరసీ కైవుయెక్కి తిరగబోకూ
పెళ్ళి చేసి పంపుతారూ పెందలకడ మేలుకోరా ౹౹టానన౹౹

134