పుట:Palle-Padaalu-1928.pdf/146

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పాండవులు పాండవులు తుమ్మెదా

——ఇది సంక్రాంతి పండుగ దిసములలో వరి వెన్నులు చేర్చి, కట్టి పళ్లేములలో పెట్టి పసుపు కుంకుమ అలంకరణము చేసి, మాలెతలు ఇంటింటికీ తిరుగుతూ పాడు పాట.

పాండవులు పాండవులు తుమ్మెదా, పంచపాండవులె తుమ్మెదా
ఓయి భామల్లాల తుమ్మెదా, భామల్లాల తుమ్మెదా
పండిన వరిచేలు తుమ్మెదా, పాయల్లు తొక్కింది తుమ్మెదా
పట్టండి నందిని తుమ్మెదా, గాణుకందాని తుమ్మెదా
యీనిన వరిచేలు తుమ్మెదా, తమ్మిరాయీదు వెడజిమ్మింది తుమ్మెదా
పోగతోటలన్నీ తుమ్మెదా, పొడిపొడిగ తోక్కిందితుమ్మెదా
చెరుకు తోటలన్ని తుమ్మెదా, చెడతొక్కి వేసింది తుమ్మెదా
యెక్కడెక్కడ వెదకినా తుమ్మెదా, యేడాదినంది తుమ్మెదా
కాపారిచేలో తుమ్మెదా కట్టి పెడతారు తుమ్మెదా
మాలవారి చేలోకి తుమ్మెదా, వెళ్లునందన్న తుమ్మెదా
మాలవారు మంచివారు తుమ్మెదా, నిన్నుగొలుతూరూ తుమ్మెదా

తుమ్మెదా అన్న పాదాంత పదములతో అంతమయ్యే పాటలు శైవ సిద్ధాంత సంబంధులే ఐనప్పటికిన్నీ. తరువాత ఇతర వస్తువును కూడా ఆకళించుకొన్నవి.