పుట:Palle-Padaalu-1928.pdf/143

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రాజ నిమ్మ పండు

ఇంకా మచ్చు పాటలే పాడుతున్నాడు. అసలు పాట 'రాజ నిమ్మ పండు.' డోలక్ వాయించే వాడు చిరు కట్టెతో తాళము నిలుపుతూ వాయిస్తాడు. అదుగో అదే——

పల్లవి :- రాజన్న రాజో ! నారాజ నిమ్మల పండో !
ఓడెల్తుందో డెల్తుంది : నారాచ ముద్దుల బావ |

అ! ప| రాజ, నారాజ, నారాజ నిమ్మల పండ:
నా అప్పరావు కొండ; నాలేత మామిడి మొగ్గ
నా అప్పుడు గాచిన నెయ్యి
నా నేతిలో ఉడికిన బూరికన్న | నేరుపైన రాజా !
ఓడెల్తుందో డెల్తుంది; నారాజ దేశమెల్లి పోతున్నావా ౹౹రా౹౹

చ :- వెళ్లే వాడ వెళతావు ! ఎన్నాళ్లకు వస్తావా ?
ఇంటి వెనుకల, ఆకుమడి దున్నెల్లు రాజా !
వచ్చిందాక; చూచుకుంటారు ౹౹రా౹౹

- చ : - వెళ్ళేవాడ వెళతావు ! ఎన్నారు వస్తావో !
ఎడమకాలి మడమ తోటి; తన్నెల్లు రాజా !
వచ్చిన దాక; చెప్పుకుంటాను ౹౹రా౹౹

3 చ :- వెళ్లేవాడ వెళతావు | రంగంతో దిగుతావు;
ఒకటో నెంబరుగళ్ళీ; చల; రెండో నెంబరుగళ్ళీ ;
చల; మూడో నెంబరుగళ్లీ ! కెళితే మళ్లీ రావు రాజో ౹౹రా౹౹

132