పుట:Palle-Padaalu-1928.pdf/142

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తోడు లేదన్నా

పిల్లల్ని ఆకర్షించటానికి ఈ పాట. వారూ పొడతారు దీని మొదటి చరణాన్ని, రెండో పాట వినండి.

ఎగిరే జట్కా బండి | నడిచే వొంటెద్దు బండి !
గ్రుడ్జెఱ్ఱ జేసింది | గుఱ్ఱం బండీ ౹౹గ్రు౹౹
యీమూడు జాతుల కలపుకోని | వూడ బొడిచిన |
రయిలు బండి | కమురు కంపు బొగ్గునీళ్లు, తోడు లేదన్నా ౹౹
వుడికె తోటకూర | మొలచే చెంచలి కూర
గ్రుడ్లెఱ్ఱ జేసింది | గులుగు కూర ౹౹గ్రు౹౹
యీమూడు జాతుల కలపుకోని ! వూడబొడిచిన,
గోంగూర | కమురు కంపు రోయ్యి పీచు తోడు లేదన్నా ౹౹
వుడికె ఉలవ పప్పు | చెరిగే సెనగ పప్పు
కళ్ళెఱ్ఱ జేసింది | కంది పప్పు ౹౹క౹౹
యీమూడు జాతుల కలపుకోని | వూడబొడిచిన
పెసర పప్పు | కమురు కంపు | నేతి బొట్టు తోడు లేదన్నా ౹౹

131