పుట:Palle-Padaalu-1928.pdf/135

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గౌరి కల్యాణ వైభోగము

__ వీరిద్దరూ మెడలకు గంధపుపూత, కొప్పు నిండా పూలతో వియ్యపురాండ్రు. ఆ పసుపు బట్టల జంట నవవివాహితులు. ఈ దంపతులకు ఆశీర్వచనమూ బహుమానమూ కోరుతున్నారు వియ్యపురాండ్రు.

గౌరీ కల్యాణ వైభోగమే
లక్ష్మీ కల్యాణ సౌభాగ్యమే
పెళ్లీ పెళ్లన్నొడు పెరుగూ తున్నాడే
కన్నమ్మ బాస్కాలు కదల మన్నాడే ౹౹గౌరి౹౹

వోలేది వోంకేది వోపెళ్లి కొడకా
వొడికట్టు బియ్యమేవి వోపెళ్లి కొడకా ౹౹గౌరి౹౹

మాబాబు గడ్డాము బవిరి గడ్డాము
యీనుందె పేలుండె ఈతముల్లుండె ౹౹గౌరి౹౹

అవిరేణి కుండలకి అంచులే లేపూ
పెళ్లి కొడుకు అబ్బాయికి పెదవులే లేవు ౹౹గౌరి౹౹

124