పుట:Palle-Padaalu-1928.pdf/136

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పల్లె వాని స్వీయ చరిత్ర

——వీడెవడు? వీపు నవల, నెత్తికి సన్నగా ఆల్లిన తాటాకు టోపీ, చేతిలో మురికి సంచీ !

నేను; పల్లోళ్ల, కుఱ్ఱోణ్ణి బాబు,
నన్ను; కోట్టోదు, తిట్టొద్దు బాబు;
నేను; దోసేది, బుఱ్ఱ సంగడి బాబు;
నేను; యేసేది, ఇసురు వలబాబు;
నాను, పుట్టింది, పూలపల్లి పుంత;
నాను; 'పెరిగింది, పెద పూడి సంత;
నా; బాబు పేరు, జల్ల కొంకు బాబు;
నా; అమ్మ పేరు, మట్ట గిడప బాబు,
నా; చెల్లెలు పేరు, చేదు పరిగె బాబు;
నా; తమ్ముడు పేరు,రొయ్యి పీసు బాబు;
నా; పెళ్లం పేరు, యిసుక దొందు బాబు;
నా; పేరు,బొమ్మిడాయి బాబు ౹౹నే౹౹

ఆ సంచిలో ఈ చేపలున్నవి కాబోలు. వీడు ఎవడో కొత్తవాడు ఎప్పుడూ చూడలేదు.