పుట:Palle-Padaalu-1928.pdf/134

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కోతికి బుద్ధులు

- ——వీధులు వదిలి సందులలో ప్రవేశిస్తాము. ఆయింటి ముంగిట ఏదో సందడి. ఆవార నుంచి పోతే గృహిణులందరూ లేచిపోతారు. ఈవార నుంచి ఏమీ యెరగనట్టుగా పదండి. ఎరుకలచిన్నది కోతిని తెచ్చినది. కోతి ఏవో పనులు చేస్తున్నది.

పతివ్రతాధర్మంబు భక్తి గాసలిపి
అతని చెంపమీద అంటిస్తూవుండు
మగనితోనీకసలు మైత్రి సరిపడక
పగదానివలె మీద పడజూ డెతల్లి
అత్తమామలతోటి అనువుగాకుంటె
క్రొత్త ముగ్గులుపెట్టి కుంగదియ్యావే
సేవచేయించుకో చిన్నత్తచేత
బావగారిని నీదు బానిసగజూడు
మరదుల నట్టిట్టు మన్నించబోకు
యిరుగు పొరుగులతోటి యిచ్చకములాడు
అంపకము లానొడు అడగవచ్చితే
కొంపగదలక కోపించుకోవే
పెద్దలు నిన్నొచ్చి పిలువ జూచితే
పెద్ద పెట్టునగోల పెట్టిఆటాడె
ఏకువలే మెత్తంగ నెరుగనట్లుండి
మేకురీతినిబిగిసి మేలుకొనియుండు
కయ్యంబులకు ముందు కాలుదువ్వుచును
పొయ్యికడ కేబోక బుద్ధిగలిగుండు
అంకినకాడికి అమరజూచుకొని
జంకు చెందక బార జాచిపోరాడె

126