పుట:Palle-Padaalu-1928.pdf/125

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కూర్చున్న పిట్టలను వుయ్యాలా
       గుండెలే మురగేసె వుయ్యాలా
వచ్చేటి పిట్టలను వుయ్యాలా
       వడిసెతోనేవేసె వుయ్యాలా
ఆపిట్ట నీపిట్ట వుయ్యాలా
       గుదికట్టుకొనివచ్చె వుయ్యాలా
పండుమని పెదనోదిన నుయ్యాలా
       వాకిట్లో వేసెనే వుయ్యాలా
రచ్చలో వుండేటి వుయ్యాలా
       రాజేంద్రాభోగి వుయ్యాలా
వినవయ్య నీ చెల్లి వుయ్యాల
       వేటలాడోచ్చింది వుయ్యాల
అట్టిమాటలు మతికి వుయ్యాల
       గిట్టునని చెప్పితి వుయ్యాల
ఆడదానికి ఆటలుయ్యాల
       మొగవాడికి వేటలుయ్యాలా

ఉయ్యాలా అన్న పాదాంతపదము సాధారణముగా జీవుని ఉద్దేశించిన వేదాంత గేయములలో కనబడుతుంది. ఈపాటలలోనికి ఆపదము అతి వ్యాప్తివల్ల ప్రవేశించింది.

114