పుట:Palle-Padaalu-1928.pdf/126

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

బ్రతుకమ్మ పాట

బ్రతుకమ్మ పాటలు తెలంగాణములోనివే. అయితే ఈపాటలో 'చందమామ ' అన్న పాదాంత పదమున్నది. ఇంకొక పాటలో

——అది అచ్చుకూడా ఆయినది—— వలలో అనీ ఉయ్యాలో అనే పాదాంత పదము లున్నవి. బ్రతుకయ్య విష్ణువు, బ్రతుకమ్మ లక్షీదేవి బ్రతుకమ్మ పండుగలు మాత్రము తెలంగాణమున తప్ప వేరేచోట జరుగుతున్నట్లు మాకు తెలియదు. ఈపాట గోవింద నామముల వరుసలో నుండుట విశేషము.

శ్రీలక్ష్మీ దేవియు చందమామ |సృష్టి బతుకమ్మయ్యె చందమామ
పుట్టినా రీతి చెప్పె " భట్టు నరసింహకవి "
ధరచోళ దేశమున " ధర్మాంగుడను రాజు "
ఆరాజు భార్యయు " అతిసత్యవతి యండ్రు "
నూరునోములు నోమి " నూరు మందినిగాంచె "
వారు శూరులయ్యు " వైరులచే హతమైరి "
తల్లిదండ్రు లపుడు " తరగని శోకమున "
ధనరాజ్యముల బాసి " దాయాదులను బాసి "
వనితతో ఆరాజు " వనమందు నివసించే "
కలికిలక్ష్మిని గూర్చి " ఘన తపంబొనరించె "
ప్రత్యక్షమై లక్ష్మి " పలికె వరమడుగుమని "
వినుతించి వేడుచూ " వెలదితన గర్భమున "
పుట్టుమని వేడగా " పూబోణి మది మెచ్చి "
సత్యవతి గర్భమున " జన్మించె మహలక్ష్మి "

115