పుట:Palle-Padaalu-1928.pdf/124

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చెలువుడి చెల్లెలు

——పుట్టినింట ఉన్న చెలువుడి చెల్లెలు విహారమును గుర్తించండి పాటలో, ఆమె యెవరో సుభద్రా సత్యభామలను గుర్తుకు తెస్తున్నది.

చెరువు కట్ట దున్నించి వుయ్యాలా
       చెరుకులే నాటించి వుయ్యాలా
మంచె మీదా మంచె వుయ్యాలా
       మంచినీళ్ల భావి వుయ్యాలో
చెలువుడీ చెల్లెల్ని వుయ్యాలా
       చేను కావీలుంచి వుయ్యాలా
ఈనెలూ బెండ్లోలిచి వుయ్యాలా
       మంచెలే కావించి వుయ్యాలా
వెండిదీ వడిశెల వుయ్యాలా
       భమిడిదీ ఆరాయి వుయ్యాలా
గిరగిరాతిప్పుతూ వుయ్యాలా
       గుప్పునా రాయొదల వుయ్యాలా
టక్కునా తగులునూ వుయ్యాలా
       తల్లకిందుగ పడును వుయ్యాలా
పొయ్యేటి పిట్టలను వుయ్యాలా
       బోరలే పగలేశె వుయ్యాలా
నడిచేటి పిట్టల్ని వుయ్యాలా
       నడుములే విరగేశె వుయ్యాలా

113