పుట:Palle-Padaalu-1928.pdf/114

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వేరే పోదామా


——అవిభక్త కుటుంబపు నీడలోనే వేరింటి కాపురము గూడు కట్టును. ప్రౌడ తనభర్త నడుగు చున్నది.

సందమామకన్న సక్కాని మొగుడా
వేరే పోదామా?
అత్త మామలపోరు నేనుపడలేను
ఆడబిడ్డలపోరు నేనుపడలేను ౹౹సం౹౹

ఉంగరాలచేయి ఊగెరా మొగుడా
కందిరీగా నడుము కదిలేర మొగుడా
వేరే పోదామా ౹౹సం౹౹

కొండంత కొప్పేమొ కదిలేర మొగుడా
కొప్పుపై జాజులు వాడెరా మొగుడా
వేరే పోదామా ౹౹సం౹౹

లక్క రాజు గంగయదాసు పాట ఒకటి ఇటు వంటిదే కాని ఇంత కన్న పెద్దది ఉన్నది.

103