పుట:Palle-Padaalu-1928.pdf/113

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

"ఏమమ్మ చెళ్లెలా ! ఇట్లువచ్చేవు ?"
" కానక కాండ్రేగు పళ్ళునేగోర
నేరక నేరేడు పళ్ళు నేగోర
కారుడ్డములు పలికె కాంతుడు మావారు
నేరాలు మోపేరు వారందరును"
కుదించి కుదించి గోడు చెందంగ
ఓదార్చి తమయింట నుండ మన్నారు

వాఖ్యాన మనవసరము. సురటి, అన్నది దేశిపదము. సురటి మిద్దెలు సీతమ్మ నురటి అనే పదములు దేశిలో కనబడుతవి. 'ఆన్నె కారి' యన్నది ఇంకొకటి.