పుట:Palle-Padaalu-1928.pdf/115

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఏరాలు


——వేరే పోవగానే సరికాదు. అక్కడనూ సమస్యలు కలవు. ఆ'దుంగ' కంటే ఈ 'కొంగ ' తోనే ఎక్కువ బాధ.

పు:-ఏరాల్ని తెస్తాను | యింటిలో పెడతాను
ఏరాలి మాటవినాలి | సుందరి పిల్ల
యేరాలి మాట వినాలి | నాయుడో లమ్మీ ౹౹ఏ౹౹

స్త్రీ:-ఏకులొడుకు తాను | యేరొండి పెడతాను
యేరాలి పోరు పడలేను ! సుందర మగడ
యేరాలి పోరు పడలేను | సోకుదారి మగడ ౹౹ఏ౹౹

పు:-వండి పెట్టలేవా | వడ్డించలేవా
కోనేటి నీళ్లు తేలేవా ! సుందరి పిల్ల
నామాట వినాలే | నాయుడో లమ్మీ ౹౹ఏ౹౹

స్త్రీ:-కూకుంటె లెగ లేను | కూడొండి పెట్టలేను
కోనేటినీళ్ల కెళ్ల లేను | సుందర మగడ
కానిమాట లనబోకు | సోకుదారి మగడ ౹౹ఏ౹౹

పు:-బంగారపు బొమ్మ | బెంగుళూరు గుంట
దాని నడుము నాగబంధములే | సుందరి పిల్ల
దాని నడక హంస నడకలే | నాయుడో లమ్మీ ౹౹ఏ౹౹

104