పుట:Palle-Padaalu-1928.pdf/103

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తడికా, తడికా

——భార్యా భర్తల నడుమ కలతలు వచ్చినది. ఆంతలోనే చిర్రు హెచ్చినది. మాటలాడుట కూడ చిన్నతనమే. తడికకు మద్యవర్తిత్వము ఆవహించినది. అయితే ఎంతసేపుండగలవు ఈతాపాలు?

వంకాయ, వండాను ! వరికూడువార్చాను,
తినమని చెప్పవే? తడికా ! తడికా!
వగలాడి మాటలకు | వళ్లంతమండింది
వద్దని చెప్పవే? తడిగా ! తడికా !
పట్టు చీర తెచ్చాను | పెట్టెలో పెట్టాను
కట్టమని చెప్పవే? తడికా ! తడికా !
చీరకంచులు లేవు | చుట్టుచెంగులు లేవు.
వద్దని చెప్పవే ! తడికా ! తడికా !
సంతలోకి వెళ్లి | సరిగంచుచీరను
అద్దాలరవికను ! అతివతెచ్చెదకట్టుకోవే !

92