పుట:Palle-Padaalu-1928.pdf/104

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వెర్రి బావ

—— వెఱ్ఱి బావను ఉడికిస్తుంది గడుసు పెండ్లాము. అడుగడుగునకూ అనుమానము కలిగిస్తూ చిక్కు విప్పేస్తుంటుంది.

ఒకరీకీ చేతులిచ్చా౯ ఒకరీకీ కాళ్ళనిచ్చా౯
ఒకరీని చేతబట్టి కూకున్నానోయ్ బావా కూకున్నానోయ్
ఎవరికీ చేతులిచ్చావ్ ఎవరికీ కాళ్ళనిచ్చావ్
ఎవరీని చేతబట్టి కూకున్నావే పిల్లా కూకున్నావే
గాజుల్ కి చేతులిచ్చాన్ కడియాలకి కాళ్ళనిచ్చాన్
డబ్బుల్నీ చేతబట్టి కూకున్నానోయ్ బావా కూకున్నానోయ్
ఒక రీనీ నాన వేశాన్ ఒక రీని చితళా కొట్టాస్
ఒకరినీ చుట్టచుట్టి కూకున్నానోయ్ బావా కూకున్నానోయ్
ఎవరినీ నానా వేశావ్' ఎవరీని చితకా కొట్టావ్
ఎవరీని చుట్టాచుట్టి కూరున్నా వేపిల్లా కూకున్నావే
సున్నోన్నీ నాన వేశావ్ వక్కల్నీ చితకా కొట్టాన్
ఆకుల్ని చుట్టా చుట్టి కూకున్నానోయ్ బావా కూకున్నానోయ్
ఒకరినీ కట్టీ వేశాన్ ఒకరినీ వదలీ వేశాన్
ఒకరీనీ చేతబట్టీ కూకున్నానోయ్ బావా కూకున్నానోయ్
ఎవరినీ కట్టి వేశావ్ ఎవరినీ వదిలీ వేశావ్
ఎవరీనీ చేతబట్టి కూకున్నావే పాపీ కూకున్నావే
ఆవుల్నీ కట్టి వేశాస్ దూడల్నీ వదిలీ వేశాన్
చెంబూనీ చేతబట్టి కూకున్నానోయ్ బావా కూకున్నానోయ్

93