పుట:Palle-Padaalu-1928.pdf/102

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నీరాడిన చేడె

——పండిత కవుల దృష్టి కందని సుందర దృశ్యము స్త్రీల పాటులో చక్కగా కనబడు తున్నది. పల్లెటూరి నీలాటి రేవులో ఇది దిన దినమూ ప్రత్యక్షమే.

నీలాటి రేవంత నిగ్గు తేరింది
పచేడె కడిగింది - ఈచాయ పసుపు
పచ్చి పసుపు దెచ్చి మరద లాడిందీ
అణుప్పను పన్నల్ల చెల్లెలాడింది
కొట్టుపసుపు కొమాళ్ళ తల్లియాడింది
చాయపసుపు దెచ్చి పూయ నేర్చింది
శాంతమ్ముబంగారు చాయల్ల దేర
కొమాళ్ళతల్లియే తానుగోపమ్మ
గొంతి యాడిన పసుపు గోవపూఛాయ
అన్నల్ల చెల్లెలే తాను అమ్మాయి
అతివ ఆడినపసుపు ఆవపువుచాయ
బావల్ల మరదలె తానుఅమ్మాయి
పణతి ఆడినపసుపు బంగారు చాయ

పసుపుకుంకుమలు సౌందర్య సామగ్రియేగాని అరంభములో మాంగల్య చిహ్నములుగా పుట్టలేదు. పరాధీన భారతము వానిని మాంగల్య చిహ్నములుగా పరిగణించుకున్నది.

నేడు తెల్ల వారి వెల్ల పొడులు సదాచారమై పోయినవి. దేశీయ సౌందర్య సామగ్రి వైపు మన తరుణుల దృష్టి మరలును గాక.

91